మన్యం న్యూస్ గుండాల: పోగొట్టుకున్న చరవానిని తిరిగి బాధితుడుకు అందించిన ఆళ్లపల్లి ఎస్సై సతీష్. ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామానికి చెందిన వార్త విలేఖరి వెంకటేశ్వర్ల చరవాణి కొద్ది రోజుల క్రితం పోవడంతో ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా మొలకలపల్లి మండలంలో ఒక వ్యక్తి దగ్గర దొరికింది రికవరీ చేసి చరవానిని బాధితుడికి ఎస్సై రతీష్ అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు
