UPDATES  

 రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలం…పైసలిస్తే చాలు ప్రభుత్వం భూమి అయినా ఖేల్ కతం…

  • రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలం.
  • పైసలిస్తే చాలు ప్రభుత్వం భూమి అయినా ఖేల్ కతం.
  • గుట్ట భూములను సైతం గిరిజనేతరులకు కట్టబెట్టిన తాసిల్దార్ కింది స్థాయి అధికారి.
  • బదిలీలు ఉన్న ఆఫీస్ ను వదలని విక్రమార్కుడు.
  • ఉన్నత స్థాయి అధికారులు స్పందించాలంటూ వేడుకుంటున్న గిరిజనులు.

మన్యం న్యూస్ చర్ల.

 

రోజు రోజుకు ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. వరద ముంపు గ్రామాలకు సహాయార్థం లక్ష్మీ కాలనీ పంచాయతీలో ప్రభుత్వం ఇచ్చిన భూములు సైతం కబ్జాకు గురి కావడం చర్ల మండల కేంద్రంలో సంచలనం గా మారింది. సాక్షాత్తు మండల రెవెన్యూ శాఖ అధికారులే కబ్జాకు పాల్పడడం విశేషం. . పేదవారికి సహాయం చేస్తున్నాము అన్న నెపంతో కన్ను పడిందే తడవుగా రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది వరద ముంపు బాధితులకు ఇచ్చే భూమిని ఆక్రమించుకున్నా ఛాయలు మెండుగా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి ఇల్లు వేసుకొని ఇంటి పన్ను కూడా తీసుకున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. రెవెన్యూ అధికారులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం పై సర్వత్రా విమర్శలు గుప్పు మంటున్నాయి. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులే కబ్జాకు పాల్పడం కంచె చేను మేసినట్టుగా ఉందని పలువురువిమర్శిస్తున్నారు. వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని తుంగలో తొక్కి రెవెన్యూ అధికారులు సైతం ఇటువంటి కబ్జాలకు పాల్పడడం కొంచెం లోతుగా ఆలోచింపజేస్తున్నాయి. దానికి తోడు ఆదివాసి తుడుందెబ్బ సంఘ నాయకుడితో కలిసి గిరిజనులను ఆయన సహాయంతో మభ్యపెట్టి

వరద ముంపు నిమిత్తం పంపిణీ చేసిన భూములను సునాయసంగా రియల్ ఎస్టేట్ పేరుతో అమ్మకాలు జరిపారని బలంగా వినిపిస్తున్న అంశo. ఐక్యతతో కూడిన వీరి కబ్జాలు రోజురోజుకీ అధికమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి అని మండల ప్రజలు వాపోతున్నారు. దీనంతటికీ ముఖ్య సూత్రధారి కొంతకాలంగా రెవెన్యూ కార్యాలయంలో పాతుకు పోయి ఉన్న తాసిల్దార్ కిందిస్థాయి అధికారి అని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అధికారి పోస్టింగు చిన్నదే అయినా తాసిల్దార్ని సైతం గడగడలాడించి తానే తాసిల్దార్ గా వ్యవహరిస్తుండడం శర మామూలుగానే జరుగుతుంది అంటూ, ప్రజలు తెలిపారు.ఎటువంటి భూమి వ్యవహారమైన తానే చూసుకుంటాడు అని అతనికి చట్టాలతో పనిలేదు గిరిజనులు అంటే లెక్కలేదు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయాలన్న దొంగ పత్రాలు సృష్టించి నిమిషాలలో చేయడం అతని స్టైల్ అని విమర్శలు గుప్పుమంటున్నాయి.

కబ్జాలో ఆరితేరిన తాసిల్దార్ కింది స్థాయి అధికారి కీ ఆదివాసి నాయకుడు తోడై ఇంకా బలం చేకూరడంతో నిప్పుకు గాలి తోడైనట్టుగా వారి బంధం ఇంకా బలపడి చర్ల మండలం లక్ష్మీ కాలనీ పంచాయతీ పరిధిలోని సాయిబాబా గుడిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమించి ఓ ప్రభుత్వ ఉద్యోగికి అమ్మి సొమ్ము చేసుకునే వరకు వచ్చింది అని మండలంలో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా దృష్టి సారించి , జరుగుతున్న ప్రభుత్వ భూ కబ్జాలపై ఉక్కు పాదం మోపాలని రెవెన్యూ కార్యాలయంలో వెలసిన అవినీతి తిమింగలాలను ఏరివేసే దిశగా అడుగులు వేయాలని, మండల ప్రజలు పత్రికా ముఖంగా కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !