నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక ప్రకటన చేసింది. పేటీఎం ఫాస్టాగ్ వినియోగిస్తున్న వారంతా వేరే బ్యాంకుల్లో కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలని సూచించింది. లేకపోతే హైవేలపై వెళ్లే వాహనదారులు పెనాల్టీలు, అదనపు ఛార్జీలు భరించాల్సి ఉంటుందని పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలు మార్చి 15 నుంచి నిలిచిపోనున్న విషయం తెలిసిందే.