అమెరికా అధ్యక్ష పదవి కోసం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ పడనున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వ నామినేషన్‌కు కావాల్సిన ప్రతినిధుల మద్దతును ఈ ఇద్దరు నేతలు సంపాదించుకున్నారు. తాజాగా జార్జియా ప్రైమరీలో డెమోక్రటిక్ పార్టీ తరఫున 1968 మంది ప్రతినిధులను బైడెన్ సంపాదించుకోగా, రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ వాషింగ్టన్‌లోనూ విజయం సాధించారు. ఇక ఇప్పటికే నిక్కీ హేలీ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.