UPDATES  

 మహబూబాబాద్ ఎంపీ స్థానంలో ఆదివాసి యువ నేత డాక్టర్ ఆరుణ్ కుమార్ ని గెలిపించుకుందాం..

మన్యం న్యూస్ వాజేడు

మండల కేంద్రంలో ఆదివాసి సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆదివాసీ ఉద్యమ నేత బోదే బోయిన, సురేష్ మాట్లాడుతూ ప్రస్తుత రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఆదివాసి సమాజం అంటే ఒక అజ్ఞాన సమాజంగా హీనపు సమాజంగా తెలివి లేని సమాజంగా పరిగణించి కనీస సామాజిక న్యాయ సూత్రాలు పాటించకుండా కాంగ్రెస్ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ గాని బిజెపి పార్టీ గాని అన్ని లంబాడీలకే సీట్లు కేటాయించిన ఈ తరుణంలో నాలుగు లక్షల పైచిలుకు ఆదివాసీల ఓట్లు కలిగిన ఆదివాసి సమాజాన్ని అవమానపరచడమే అని అణిచివేయటమే అని అన్నారు

 

మహబూబాబాద్ ఎంపీ పరిధిలో భద్రాచలం ములుగు పినపాక ఇల్లందు ఆదివాసి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అధిక శాతం ఓట్లు ఆదివాసులై ఉన్నప్పటికీ ఆదివాసీలు ఐక్యంగా ఓట్లు వేయరు అనే ఒక కారణంతోనే లంబాడీల పై ప్రేమ చూపిస్తున్నాయని అన్నారు

 

లంబాడీలు ఎస్టీలు కాదనే ఉద్యమాన్ని తెర మీదికి తీసుకొచ్చి ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలపై అనునిత్యం పోరాటం చేస్తూ దేశవ్యాప్తంగా ఆదివాసీలతో సంబంధాలు కలిగి ఉద్యమంలో 43 కేసుల పాలైన నిత్యం ఆదివాసుల కోసం శ్రమిస్తున్న ఉన్నత విద్యావంతుడు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి ఆరుణ్ కుమార్ గారిని ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంచి గెలిపించుకుంటామని ఈ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు

 

గూడెం గూడెం పల్లె పల్లె యువత విద్యార్థులు ఉద్యోగులు లంబడిలపై చేసే యుద్ధం లో ముందు ఉండాలి అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !