- ఆపద్బాంధవులకు సత్కారం
- గోదావరి వరదల సమయంలో సహాయం అందించిన వారికి సత్కారం
- కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న చర్ల మండల వాసులు
మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2022 23 సంవత్సరం వచ్చిన గోదావరి వరదల సమయంలో సహాయ సహకారాలు అందించిన చర్ల మండల వాసులకు, చర్ల ప్రెస్ క్లబ్ సభ్యులకు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రియాంక అల అవార్డులు అందించడం జరిగింది. 2023 వ సంవత్సరంలో వచ్చిన గోదావరి వరదల సమయంలో బాధితుల పక్షాన నిలబడి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ వార్తలు సేకరించి ఎప్పటికప్పుడు జిల్లా అధికారుల సూచనలు పాటిస్తూ,వార్తల ద్వారా అధికారులను అప్రమత్తం చేయడమే కాక గోదావరి వరదల సమయంలో పలు సేవలు అందించినందుకుగాను మండల మీడియా మిత్రులైన మహబూబ్ పఠాన్,తోటమల్ల కృష్ణారావు,జర్నలిస్ట్ టుడే రిపోర్టర్ లక్ష్మణ్ కుమార్ లను అభినందిస్తూ అవార్డులను అందజేయడం జరిగింది. వీరితోపాటు రైతులను, స్వచ్ఛంద సేవా సంఘం వారిని,ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక అల మాట్లాడుతూ గోదావరి వరదల్లో చిక్కుకున్న బాధితులకు తమ బాధ్యతగా సేవలు అందించిన ప్రతి ఒక్కరికిఅభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సేవలు అందించడంలో ముందుండాలని, ఒకరికొకరు సహాయ పడటం అనేది ఒక మహత్కార్యం అని తెలిపారు. కార్యక్రమంలో మాజీ రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు, మీకోసం మేమున్నాం టీం చైర్మన్ నీలి ప్రకాష్, ఎస్ కే ఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ షాజహాన్, రైతులు పోలిన లంక రాజు, పోలిన రాముడు, పోట్రు బ్రహ్మానందరెడ్డి, కాపుల నాగరాజు, మెంతుల నాగరాజు, శివ రాజు తదితరులు పాల్గొన్నారు.