మన్యం న్యూస్ గుండాల: గుండాల పోలీస్ స్టేషన్ ను ఇల్లందు డి.ఎస్.పి చంద్రబాను గురువారం సందర్శించారు. అనంతరం మండలం పరిధిలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన దామరతోగు గ్రామాన్ని ఆయన సందర్శించారు. అనంతరం గుండాల మండల సరిహద్దు గ్రామాలను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ ఎల్.రవీందర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్ పాల్గొన్నారు