మంచువారి కుటుంబంలో మరో బుజ్జాయి చేరనుంది. మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె సీమంతం వేడుక బంధు మిత్రుల సమక్షంలో నంద్యాలలో సింపుల్గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతేడాది మార్చి 3న మంచు లక్ష్మి ఇంట్లో వీరి వివాహం జరిగింది.
