మన్యం న్యూస్ చర్ల;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్న మిడిసీలేరు గ్రామం లోని గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనీ పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న గ్రామ యువత పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు, స్కేల్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ లీడర్ పృథ్వి మాట్లాడుతూ… మండలంలోని పోయిన సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో మొదటి స్థానం సాధించిన మన చిన్న మిడిసిలేరు పాఠశాల ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రథమ స్థానం సాధించలని, విద్యార్థులు మంచి శ్రద్ధతో చదివి ఈ భవిష్యత్తు కోసం మన గ్రామం పేరు కోసం మంచి ఫలితాలు సాధించాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఐ మంజుల, ఉపాధ్యాయులు టి. సూరయ్య, రాద,భాస్కర్, యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.