- ఏటూరు నాగారం నూతన ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ఐపిఎస్
- ఎటువంటి కోచించి లేకుండానే.. సివిల్స్ కొట్టిన రైతు కూలి బిడ్డ
- ఎందరికో ఆదర్శంగా నిలిచిన యువ ఐపీఎస్
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ కు చెందిన బాబా సాహెబ్, సోజల్ దంపతుల రెండో సంతానం మహేశ్ బి.గీతే. పూర్తిగా వ్యవసాయ కుటుంబ నేపథ్యంలోనే పెరిగారు. వ్యవసాయంలో తల్లిదండ్రుల కష్టాలను చూసి చదువుకునేందుకు పూణే వెళ్లి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాడు.
డిగ్రీ పూర్తి కాగానే 2020లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యారు. మొదటి ప్రయత్నంలో లక్ష్యం చేరకపోవడంతో రెండోసారి ప్రయత్నించారు. ఎటువంటి ప్రత్యేక కోచింగ్ తీసుకోకుండా దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీసెస్ లో 399 ర్యాంక్ సాధించి ఐపీఎస్ గా ఎంపికయ్యాడు.
యుపిఎస్సి లక్ష్యంగా ప్రణాళికతో చదివి ఒకటి కాదు రెండు కాదు ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శoగా నిలిచాడు.
ఐపీఎస్ గా శిక్షణ అనంతరం తెలంగాణ రాష్ట్ర గ్రేహౌండ్స్ విభాగంలో అసాల్ట్ కమాండర్ గా విధులు నిర్వహించిన మహేష్ గీతే గారు ప్రస్తుతం ఏ ఎస్ పి ఏటూరునాగారం గా బాధ్యతలు స్వీకరించారు.