UPDATES  

 ప్రేమకు బలైన మరో దిశ…దారుణ హత్య కు దారి తీసిన ప్రేమ వ్యవహారం…

  • ప్రేమకు బలైన మరో దిశ.
  •  దారుణ హత్య కు దారి తీసిన ప్రేమ వ్యవహారం.
  •  ప్రియుడు వేధింపులతో హాస్టల్ లోఉరి వేసుకొని మరణించిన ఎంబీఏ విద్యార్థిని సాహితి.
  •  ఈ ఉదాంతానికి కారణం కాంగ్రెస్ లీడర్ తనయుడే అంటూ గగ్గోలు.
  •  సాహితి మరణించడంతో పరారైన కాంగ్రెస్ లీడర్ తనయుడు.
  •  న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన సాహితీ తల్లిదండ్రులు.

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.

వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, సుంకరి వెంకట సుబ్బారావు, కుమారి దంపతుల కుమార్తె సాహితీ 27 దిల్షుక్నగర్ లో ఎంబీఏ చదువుకుంటుంది. గత కొంతకాలంగా చీడం హరీష్ అనే యువకుడు వేధిస్తున్నాడని ప్రేమ వేధింపుల కారణంగా ఆ బెదిరింపులు భరించలేక హాస్టల్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయినట్టుగా సాహితీ మిత్రులు తెలిపారు.

గొప్ప చదువుల కోసం వెళ్లిన సాహితీ జీవచ్ఛవమై ఉరితాడు పెనుకొని ఉన్న స్థితిని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఉదంతానికి పాల్పడిన వ్యక్తుల కొరకు ఆరా తీసిన నేపథ్యంలో సాహితీ చరవాణిలో ఆసక్తికరమైన నిజాలు బయటపడ్డాయి .మానసికంగా వేధించి తనంతటకు తానే ఉరి వేసుకొని చనిపోయేలా ఆమెను మెసేజ్ లతో, వీడియో కాల్ తో చిత్రవధ చేసిన సంఘటనలు ఆమె మరణించే ముందు తీసుకున్న వీడియో ఆధారంగా లభించినట్టు సాహితీ తల్లిదండ్రులు తెలిపారు. ఆ ఆధారాలతో దిల్షుక్నగర్ పోలీసులు ఆరా తీసిన నేపథ్యంలో వెంకటాపురం మండలానికి చెందిన పి ఎస్ ఎస్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ మండల కీలక నాయకుడు చీడెం మోహన్ రావు, మరియు అతని తనయుడు చీడెం హరీష్ అని వెల్లడించినట్టుగా సాహితీ తండ్రి తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు మరియు పోలీసులు తన పోస్ట్మార్టం నిమిత్తం హాస్పటల్ కి తరలించి సాహితి సొంత ఊరైన ఆలు బాగా తీసుకొచ్చిన నేపద్యంలో , వెంకటాపురం మండలం వాజేడు మండలం ప్రజానీకమంతా కూడి సాహితీకి జరిగిన అన్యాయంపై ఆమెకు అండగా నిలబడి తన భౌతిక దేహం తో రాత్రి చీడెం మోహన్రావుని హరీష్ ని అరెస్ట్ చేయాలని నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడిన చీడం మోహన్రావు తనయుడు కోసం చరవాణి ద్వారా సంప్రదించిన నేపథ్యంలో అధికార మదంతో సాహితీ తండ్రికి ఏం చేసుకుంటావో చేసుకో, మీకు దిక్కున కాడ చెప్పుకో అని సమాధానం చెప్పడం ప్రస్తుతానికి మండల కేంద్రంలో సంచలనాత్మకంగా మారింది, ఈ మాటతో సాహితీ కీ అండగా ఉన్న మండల ప్రజల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా అంటూ చీడెం మోహన్ రావు పై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మోహన్రావుకు తన తనయుడికి కఠిన శిక్షలు పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని. ఇలాంటి ఘాతకాలు మళ్లీ జరగకుండా ఏ అధికారం అడ్డుపెట్టుకొని సాహితీ మరణానికి కారకులయ్యారో ఆ అధికారంలో నుండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అతనిపై కఠిన చర్యలు తీసుకొని వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని మండల ప్రజలు, సాహితీ తండ్రి బరువైన హృదయంతో మండలమంతా వినిపించేలా తన ఆవేదన వ్యక్తపరిచాడు.

ఇంత జరుగుతున్నా చీడెం మోహన్రావు మరియు తన కుమారుడు మండలంలో కనిపించకపోవడం విశేషo

వారిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకొని సాహితీ బలవత్ మరణానికి కారకులైన వారికి కఠినమైన శిక్ష విధించాలని యావత్ ప్రజానీకం కోరుకుంటుంది.

అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో దిశా మరణం లాగానే ఇది పరిగణించవచ్చు అంటూ

ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రంలో దిశ రక్షణ యాక్ట్ పెట్టిన విధంగానే తెలంగాణలో కూడా సాహితి మరణం నేపథ్యంలో సాహితీ రక్షణ యాక్టుని ప్రారంభించాలని యావత్ ములుగు జిల్లా ప్రజానీకం కోరుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !