గర్బిణి మహిళలకు శ్రీమంతాలు
*గర్బిణి మహిళలకు శ్రీమంతాలు,చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చెయించిన సూపర్వైజర్ రాజమణి*
మన్యం న్యూస్ కరకగూడెం:మణుగూరు ఐసిడియస్ ప్రాజెక్టు అధ్వర్యంలో పోషణ్ పక్వాడ ప్రోగ్రామ్ లో భాగంగా మండల కేంద్రంలోని అనంతారం గ్రామ సెక్టర్ పరిధిలో అంగనవాడీ సూపర్ వైజర్ రాజమణి అధ్వర్యంలో గర్బిణి మహిళలకు శ్రీ మంతాలు, చిన్న పిల్లలకు అక్షరాస్యం నిర్వహించారు.ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ అనంతరం గ్రామపంచాయతి లో గల వలస ఆదివాసీ గ్రామమైన భాగ్యనగరం మహిళలకు శ్రీమంతాలు చేశామని తెలిపారు.అలాగే గర్బిణి స్త్రీల కు గర్భవతిగా ఉన్నప్పుడు ఎటువంటి పోషకాహారం తిసుకోవాలో వివరించడం జరిగిదని తెలిపారు. అనంతరం చిరుధాన్యాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞా చెయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు ఎట్టి.సుజాత,కుంజ.సావిత్రిఅయ్యెరు.సునిత,పూర్ణిమ,అమరవాతి,భానుప్రియ,గ్రామపంచాయతి సెక్రటరీ రమేష్, ఎంపిహెచ్ఎల్ రమాదేవి,ఆశా కర్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.