స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా టాలీవుడ్ నుంచి బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన కీర్తి సురేష్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో రానున్న మూవీలో మహానటి ఛాన్స్ కొట్టేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.
