రజనీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబోలో తలైవర్ 171 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ మూవీలో నటించడానికి ఆసక్తి ఉన్నవారు కావాలంటూ బెంగళూరులో ఆడిషన్స్ జరుగుతున్నాయని ఓ పోస్టు పెట్టారు. అది నమ్మి ఆడిషన్స్‌కి వెళ్లి మోసపోయిన వారిలో మృదుల అనే ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృదుల వద్ద రూ.3.9 లక్షలు తీసుకున్నట్లు చెప్పింది
