కన్నప్ప కథను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ’నా తండ్రి పుట్టినరోజు నాడు కన్నప్పపై కామిక్ బుక్ విడుదల చేస్తాను‘ అని మంచు విష్ణు తెలిపారు. ’మునుపెన్నడూ నేను ఇలాంటి పాత్రలు పోషించలేదు. అందువల్ల ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసే ముందు కాస్త కంగారుపడ్డా. కన్నప్ప, శ్రీకాళహస్తి కథ అందరికీ చెప్పేందుకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మార్చి 19న కన్నప్ప కథను తెలియజేస్తూ ఫస్ట్ వాల్యూమ్ కామిక్ బుక్ విడుదల చేస్తున్నా‘ అని తెలిపారు.
