ఇటీవల బహుజన్ సమాజ్ పార్టీ(BSP) రాజీనామా చేసిన RS ప్రవీణ్ కుమార్.. తాజాగా BRSలో చేరుతున్నట్లు ప్రకటించారు. ‘నా రాజకీయ భవితవ్యంపై శ్రేయోభిలాషులతో చర్చించా. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం రేపు కేసీఆర్ సమక్షంలో BRSలో చేరుతున్నాను. నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
