WPL-2024 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో ఆదివారం జరిగిన ఫైనల్లో RCB 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన DC 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో RCB ఛేదించింది.
