- వాంటెడ్ ఎక్సైజ్ అధికారులు.
- రండి బాబు రండి మంచి తరుణం మించక ముందే త్వరపడండి.
- ఎక్సైజ్ అధికారులు కనిపించడం లేదు.
- వారిని కనిపెట్టిన వారికి ఎక్సైజ్ శాఖప్రోత్సాహంతో మద్యాన్ని అదనంగా విక్రయించే ఆ పై 60 రూపాయలు ఇవ్వబడును.
- హాస్యాస్పదంగా వేడుకుంటున్న ప్రజలు.
మన్యం న్యూస్ భద్రాచలం నియోజకవర్గం.
రోజురోజుకు మద్యం మత్తు మిన్నంటుతున్న పరిస్థితులు గోదావరి పరిహార ప్రాంతాలైనటువంటి వాజేడు చర్ల వెంకటాపురం మండలంలో ప్రమాద గంట్టికలు మోగిస్తున్నాయి.
18 సంవత్సరాలు నిండిన యువకుల దగ్గర నుంచి పండు ముసలి వరకు నీళ్లన్నీ మరిచి మద్యాన్ని అక్కున చేర్చుకున్న పరిస్థితులు ఉన్నాయి.
దానికి తోడు వారు తాగేది కల్తీ మందు అవ్వడంతో అది తాగిన యువత మత్తులో చిత్తయిపోతునారు. ధర తక్కువ కిక్ ఎక్కువ అవ్వడంతో గుడుంబాను తాగడానికి కూడా వెనకాడని పరిస్థితులు ఈ మూడు మండలాల్లో చూడొచ్చు , ఇదే అదునుగా వైన్ షాప్ యాజమాన్యాలు వారి మత్తును క్యాష్ చేసుకోవడం కోసం గుడుంబా ప్యాకెట్లను కూడా వైన్ షాప్ లోనే విక్రయించే పనిలో పడ్డారు అని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పర్మిషన్లు వైన్స్ కో గుడుంబా విక్రయాలకో అర్థం కాని విధంగా విక్రయాలు జోరుగా జరుగుతున్నట్టు కల్తీ మందులు తాగి రోడ్లమీద పడకేసిన మందు బాబులను చూస్తే అర్థమవుతుంది. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం పొరపాటున కన్నెత్తి కూడా చూడరు , ఎవరైనా చరవాణి ద్వారా వారికి ఫోన్ చేద్దామని అనుకుంటే అది పొరపాటే మరి, ఎందుకంటే ఎన్నిసార్లు చేసినా అది బిజీ వస్తుంది కాబట్టి, దీన్నే ఆసరాగా తీసుకొని మందు విక్రయించేవారు , సాటుగా అమ్మే పరిస్థితి నుండి రోడ్ల మీదనే విక్రయాలకు చేస్తున్నపరిస్థితులు ఉన్నాయి.
అర్ధాంతరంగా యువత జీవితాలు, అతివల భర్తల జీవితాలు కళ్ళముందే నాశనం అవుతూ ఉంటే ఎక్సైజ్ అధికారులపై మండల ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. వారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు, మా భర్తలు మా పిల్లలు చనిపోతూ ఉంటే మచ్చుకైనా చూడరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, రండి బాబు రండి మంచి తరుణం మించక ముందే త్వరపడండి, ఎక్సైజ్ అధికారులు కనిపించడం లేదు ఫుల్లుగా తాగి పడిపోండి, జీవితాలను నాశనం చేసుకోండి, అంటూ వారిని కనిపెట్టిన వారికి ఎక్సైజ్ శాఖ ప్రోత్సాహంతో మద్యాన్ని అదనంగా విక్రయించే ఆపై 60 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాము అంటూ వారిపై విమర్శలు గుప్పించారు.
ఈ విమర్శలపై ఎక్సైజ్ శాఖ వారు ఎంత మేరకు స్పందిస్తారో,
ఎంత మేరకు ఈ మూడు మండలాలలో మద్యాన్ని అరికడతారో వేచి చూడాలి.