UPDATES  

 మా దేవుని భూమిని మాకు ఇప్పించండి..

మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి రహదారిలో ఉన్న నాయక పోడు కులదైవమైన లక్ష్మి దేవర, రాయి పాపయ్య భూమిని మాకు ఇప్పించాలని నాయక పోడు కుల సంఘం నాయకులు గుండాల తాసిల్దార్ కు వినతి పత్రాన్ని ఇచ్చారు. మండల కేంద్రానికి చెందిన ఒక కుటుంబం ఆ భూమిని ఆక్రమించి ఇవ్వటం లేదని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎన్నో తరాలుగా ఇక్కడే తమ పెద్దలు జాతర నిర్వహించారని అది ఆక్రమణకు గురి కావడంతో జాతర కనుమరుగైందని అన్నారు మళ్ళీ ప్రారంభించాలంటే తమ భూమి తమకు కావాలని వారు తాసిల్దారును కోరారు. ఈ కార్యక్రమంలోచెబోతు రంజిత్ కుమార్, గోవింద నర్సింహా రావు, చేబోతు రవి, చేబోతు రాజు, గోవింద బుజ్జిబాబు, దబ్బ దేవేందర్, సింగం కుమార్, దేవిరెడ్డి వీరకుమార్, చేబోతు రాజబాబు, చెబోతు రమేష్, దబ్బ గిరిబాబు, దబ్బ శోభన్ బాబు, దేవిరెడ్డి సీతారాములు, మేకల సమ్మయ్య, మేకల రమేష్, పాండ్ల నగేష్, దేవిరెడ్డి లక్ష్మి, చెబోతు పద్మ, గోవింద సమ్మక్క, చెబోతు లక్ష్మి, చెబోతు రుద్ర, దబ్బ సమ్మక్క, చెబోతు సుక్కబాయి, చెబోతు సాంబలక్ష్మి.మేకల స్వరూప పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !