టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా ఈ స్టార్ కుమారుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూవీ తీయనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, ఆదిత్య 369 సీక్వెల్లో కూడా మోక్షజ్ఞ నటించనున్నాడని తెలుస్తోంది.
