రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు ఓ చిత్రాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. #RC16 వర్కింగ్ టైటిల్. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ మూవీని హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ప్రముఖ దర్శకులు శంకర్, సుకుమార్, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బోనీ కపూర్, తదితరులు పాల్గొని, చిత్ర బృందానికి విషెస్ తెలిపారు.