మన్యం న్యూస్ మంగపేట.
బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ గత రెండు రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
గురువారం మంగపేట వారి ఇంటి వద్ద పరామర్శించి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని తెలియచేశారు.అలాగే
మంగపేట మండలం పార్టీ మైనార్టీ మండల నాయకులు బుట్టో గత కొద్దిరోజుల క్రితం గుండెకు స్టంట్ ఆపరేషన్ చేసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బుట్టోని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు. వారు మాట్లాడుతూ పార్టీ మీకు అన్ని విధాలుగా బాసటగా నిలుస్తుంది అని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం, మండల నాయకులు,, అయూబ్, పాషా ,తాడురు రఘు, బాస పుల్లయ్య, ఖాళీల్, సారయ్య, చిప్ప నాగరాజు, ముస్టాప్,
మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి ,తదితరులు పాల్గొన్నారు.