పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ క్రేజ్ ఉన్న ఈ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ ధర పలుకుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఏకంగా రూ.160 కోట్ల బడ్జెట్ పెట్టడానికి ఆ సంస్థలు సిద్ధమైనట్లు టాక్.