- వాజేడు మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
- త్రాగునీరు సమస్యపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం
- డిపిఓ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
- సమావేశం నుండి బయటకు వెళ్లిన డిపిఓ
మన్యం న్యూస్ వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన తాగునీటి సరఫరా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ములుగు డిపిఓ స్వరూప పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్ పేరు చెప్పి పంచాయతీ కార్యదర్శుల దగ్గర నుండి ముడుపులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని నీ పద్ధతి మార్చుకోకపోతే వేటు పడక తప్పదని హెచ్చరించారు.తక్షణమే ఈ సమావేశ హాల్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించడంతో డిపిఓ స్వరూప బయటకు వెళ్లారని ప్రజలలో వినికిడి, పద్ధతి మార్చుకోకపోతే ఎంతటి ఎవరికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
వాజేడు మండలంలో త్రాగు నీరు సమస్యపై దృష్టిసాదించిన కలెక్టర్ ఇలా త్రిపాటి. ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉన్న గ్రామాలలో పర్యటించారు.
మురుమూరు గ్రామపంచాయతీలో బిజినపల్లి గ్రామంలో, చెరుకూరు గ్రామపంచాయతీ శ్రీరామ్నగర్ గ్రామంలో పలు గ్రామాలలో త్రాగునీటి సమస్య ఉన్నందున త్రాగునీటి బోరు శాంక్షన్ చేశారని, తెలిపారు. భీమవరం,భువనపల్లి, గ్రామాలలో త్రాగునీటి సమస్య అధికంగా ఉన్నందున పైపులైను శాంక్షన్ చేశారని, ఇటీవల కాలంలో వైరల్ ఫీవర్ పట్టిపీడించాయని ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మిసిని భగీరథ డి ఈ, వాజేడు స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్, ఎంపీ ఓ శ్రీకాంత్ నాయుడు, వందలాదికారులు తదితరులు పాల్గొన్నారు.