మన్యం న్యూస్ చర్ల:
ఆదివాసి పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్ది నేటి తరానికి పోటీ తత్వంగా సంపూర్ణ జ్ఞానాన్ని ఆ ఆదివాసి పిల్లల్లో సముపార్జన చేయిస్తూ ప్రతిభవంతునిగా తీర్చిదిద్దిన విద్యావేత్త ఆ ఉపాధ్యాయుడు. వివరాల్లోకెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నమిడిసిలేరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా శ్రీనివాసరావు గత కొద్ది సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు. గురువారం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా ఆ గ్రామ యూత్ అధ్యక్షులు పృద్వి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆదివాసి ప్రాంతమైన మా చిన్న మిడిసిలేరు గ్రామంలోని విద్యార్థులకు మంచి నైపుణ్యమైన జ్ఞానాన్ని అందిస్తూ ప్రతిగావంతులైన విద్యార్థులుగా తీర్చి దిద్దడంలో అతని సేవలు మరువలేనీవి అని కొనియాడుతూ గ్రామ యువత ఘనంగా శాలతో సన్మానించారు. శ్రీనివాస రావు ఉపాధ్యాయులు మరెందరు మా ఆదివాసి గ్రామాలకు రావాలని మంచి విద్యను మా పిల్లలకు అందించి నేటి సమాజంలో ప్రతిభావంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయురాలు మంజుల, హెచ్ఎం ఎడమ రాజు, ఎంపీటీసీ శోభారాణి, ఉపాధ్యాయులు సూరయ్య, దశరథం, గ్రామ పెద్దలు వెంకటేశ్వర్లు, అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి, లక్ష్మి, గ్రామ యువత ప్రజలు పాల్గొన్నారు.