మన్యం న్యూస్ వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండలం లక్ష్మీపురం గ్రామంలో సర్వేనెంబర్ 50 లో 28 ఎకరాల భూమి లో గ్రామస్తులు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆ భూమిలో కందకం తవ్వించి గ్రామస్తులను ఫారెస్ట్ భూమిలోకి పోకుండా చేశారని, 28 ఎకరాల భూమిలో ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు భూమి వస్తుందని ఊరు మధ్యలో నుండి ఫారెస్ట్ దిమ్మలు కడుతున్నారని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పద్ధతి మార్చుకోవాలని జీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చింత మోహన్ రావు తెలిపారు. ఆదివాసి భూముల జోలికి రెవెన్యూ ,ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావద్దని, ఆదివాసుల భూముల జోలికి వస్తే తగిన బుద్ధి చెబుతామని ఆదివాసి ప్రజలు తెలిపారు.
మొండికుంట ప్రాజెక్ట్ లో భూమి కోల్పోయిన కుటుంబాలకు సర్వేనెంబర్ 50 గల భూమిలో రెవెన్యూ అధికారుల సమక్షంలో లక్ష్మీపురం గ్రామస్తులకు ఈ భూమిని ఇచ్చారని, ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు ఈ భూమి ఫారెస్ట్ లో ఉందని, గ్రామం విడిచి వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు తీరు ఉందని, ఆదివాసి కుటుంబాలు ఎక్కడ ఇల్లు కట్టుకున్న ఆ భూమి మాదే అంటూ రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల ప్రవర్తన వలి ఉంటుందని, గ్రామాల గ్రామాలకు కాలు చేసే ప్రయత్నం చేస్తుందని, ఆదివాసీ ప్రజల పక్షాన ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు.