టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేస్తున్నాడు. ఇదివరకే వీళ్ల కాంబినేషన్ లో ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ సినిమాలు వచ్చాయి. అయితే ఇటీవల విరూపాక్ష మూవీతో అద్భుత విజయం సాధించిన దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు చైతు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.