అంగారకుడిపై నోక్టిస్ అనే భారీ అగ్నిపర్వతాన్ని పరిశోధకులు కనుగొన్నారు. 29,600 అడుగుల ఎత్తు, సుమారు 450 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ఈ భారీ అగ్నిపర్వతం అంగారకుడి భూమధ్యరేఖకు దక్షిణంగా తూర్పు నాక్టిస్ లాబ్రింథస్ ప్రాంతంలో ఉంది. నాసాకు చెందిన మారినర్ 9, వైకింగ్ ఆర్బిటర్ 1, 2, మార్స్ గ్లోబల్ సర్వేయర్, మార్స్ ఒడిస్సీ, మార్స్ రికానిసెన్స్ ఆర్బిటర్, ఈఎస్ఏకు చెందిన మార్స్ ఎక్స్ప్రెస్ వంటి మిషన్ల డేటా ద్వారా ఈ పరిశోధన సాధ్యమైంది.