మన్యం న్యూస్ కరకగూడెం : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మండల పరిధిలోని కలవల నాగారం గ్రామానికి చెందిన శోభన్ (36) అనే వ్యక్తితో అశ్వాపురం సమీపంలోని తండాకు చెందిన యువతీతో వివాహం అయినది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. నాలుగు నెలల క్రితం తన భార్యతో వివాదం అయినది. ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయి తన భర్త దగ్గరకు అప్పటినుంచి రాలేదు . తన భార్య తన దగ్గరికి రావడం లేదని మనస్థాపన చెంది గురువారం పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి శుక్రవారం మృతి చెందారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తెలిపారు.