తెలుగు చిత్రపరిశ్రమ 90ఏళ్ల వేడుకలను జులైలో మలేషియాలో నిర్వహిస్తామని, పెద్దలతో చర్చించి వేడుక తేదీని నిర్ణయిస్తామని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఈ వేడుకల సందర్భంగా జులైలో షూటింగ్ లకు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరామని, సెలవుపై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారని తెలిపారు.