బస్తర్ సినిమాలో నటించినందుకు తనను దారుణంగా ట్రోల్ చేసినట్లు హీరోయిన్ అదాశర్మ తెలిపారు. “ది కేరళ స్టోరీ సమయంలోనూ కొందరు సినిమా చూడకుండానే దాని గురించి మాట్లాడారు. కామెంట్స్ చేసే స్వేచ్ఛ మీకు ఉన్నట్లే. ‘బస్తర్’ లాంటి సినిమా తీసే హక్కు మాకు ఉంటుంది. నేను అందంగా ఉన్న పువ్వుల ఫొటో పెట్టినా దానికి ఇబ్బందికరమైన కామెంట్స్ చేస్తున్నారు. వేశ్య వంటి పదాలను వాడుతూ ట్రోల్ చేస్తున్నారు’ అని వాపోయారు.