తన సినీ, వ్యక్తిగత జీవితం గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘నా తొలి చిత్రం పోడాపోడీ షూటింగ్ సమయానికి నా ఏజ్ 22ఏళ్లు. 28 ఏళ్లలోపు స్టార్‌గా ఎదిగి, 32 ఏళ్లకు పెళ్లి చేసుకుని, 34 ఏళ్లకు పిల్లల్ని కనాలనుకున్నా. ఇప్పుడు నా వయసు 38 ఏళ్లు. నేను వేసుకున్న ప్రణాళికలేవీ వర్కవుట్ కాలేదు’ అని చెప్పారు. ఇటీవల సన్దేవ్తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.