తమ జీవితాల్ని మార్చిన సినిమా’ఈ రోజుల్లో’ అని దర్శకుడు మారుతి అన్నారు. అప్పట్లో పరిమిత వ్యయంతో సరదాగా చేసిన ఈ సినిమా.. సాంకేతికంగా పరిశ్రమలో స్ఫూర్తి నింపిందని అన్నారు. పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడిగా తన జీవితాన్ని మలుపు తిప్పిన ఈ చిత్రం ఓ మధుర జ్ఞాపకమని చెప్పుకొచ్చారు.