‘‘మంచి కథ కుదిరితే టాలీవుడ్‌లోనూ హీరోగా నటిస్తా. దర్శకుడిగా చేయాల్సి వస్తే ప్రభాస్‌తో సినిమా చేస్తా‘’ అని హీరో పృథ్వీరాజ్ అన్నారు. ’’ఎడారిలో దారి తప్పి ఆకలితో అలమటించే వ్యక్తి సహజంగా ఎలా కనిపిస్తాడో నేను అలా ‘ఆడుజీవితం‘లో కనపడాలనుకున్నా. ఈ సినిమా కోసం మొదట బరువు పెరిగిన నేను ఆ తర్వాత 31 కిలోలు తగ్గాల్సి వచ్చింది. 72 గంటలపాటు కేవలం మంచినీళ్లు, బ్లాక్‌కాఫీ మాత్రమే తాగేవాడిని’’ అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.