టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న ఓ తెలుగు అగ్ర నిర్మాతతో ఆమె ఏడాదిగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది. అంజలి ప్రస్తుతం గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.