పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ గ్లింప్స్ రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. తాజాగా మూవీ నుంచి మేకర్స్ అప్‌డేట్ అందించారు. మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్ హష్మీ ఫొటోను మూవీ యూనిట్ షేర్ చేసింది. ‘యుద్ధాన్ని ఊహించలేరు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది