మానవుల నుంచి సేకరించిన బాక్టీరియాతో టీబీకి కొత్త వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు. చిన్నారులు, పెద్దలకు మెరుగైన ఫలితాలనిచ్చే వ్యాక్సిన్‌పై ఎన్నే ఏళ్లుగానో ప్రయోగాల ఫలితమే ఎంటీబీ వ్యాక్సిన్(ఎంటీబీవీఏసీ). అయితే దీనిపై క్లినికల్ ట్రయల్స్‌ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ Biofabri సహకారంతో 2025లో భారత్‌లో పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఇవాళ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని బయోఫాబ్రి ప్రకటించింది.