‘ఓం భీం బుష్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.21.75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చిత్రంలో హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.