మన్యం న్యూస్ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగూడెం గ్రామానికి చెందినవారు , హైదరాబాదు నగరంలోనీ ఉప్పల్ ప్రాంతంలో గల మాతృ అభయ ఫౌండేషన్ నిర్వాహకులు రామటెంకి రమేష్, దేవకాదేవి దంపతులు, ప్రొఫెసర్ జాడి మురళీధర్,చేతుల మీదగా నేటితరం విద్యార్థులకు పరిజ్ఞానిక విద్య ఎంతో ప్రాముఖ్యతమైనదని గమనించి మారుమూల ప్రాంతాల్లో గల అనంతారం, కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలకు కంప్యూటర్ లు,విద్యార్థుల ఎగ్జామ్స్ కు అవసరమయ్యే సామాగ్రి తో పాటు స్పోర్ట్స్ దుస్తులను అందజేశారు.పాఠశాలలతో పాటు అశ్వాపురంపాడు,అంగారిగుడెం అంగన్వాడికి దుస్తులను ఆట వస్తువులను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతు. విద్యార్థులు వారి జీవితంలో అత్యున్నత ఆశలను సాధించడానికి శ్రమించాలి అని ఆయన అన్నారు. విద్యార్థులు భవిష్యత్తు ప్రణాళికలు విద్యార్థి దశ నుండే ఎంచుకోవాలని ఆదన్నారు. తల్లిదండ్రులు పిల్లల లక్ష్యాల కనుగుణంగా వారికి సహాయ సహకారాలు అందించాలని వారు తెలిపారు.ఏజెన్సీ గ్రామాలలో ఉన్న విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తోపాటు విద్యార్థులు .