- ఫీజును వెంటనే తగ్గించాలి.
- 200 నుండి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం
- నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్
మన్యం న్యూస్ కరకగూడెం: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టేట్ ఫీజు. 2 వందల నుండి రూ. వెయ్యికి పెంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈనెల 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని, అయితే ఈసారి అప్లికేషన్ ఫీజులు భారీగా పెంచడంతో నిరుద్యోగుల పైన ఫీజుభారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. టెట్ పరీక్ష 20215 5.200, 20225 6.300, ໖ 2 పేపర్లకు కలిపి రూ.400 ఫీజు ఉండేదని, ఈ నోటిఫికేషన్ లో ఒక పేపరకు దరఖాస్తు చేసుకంటే రూ.వెయ్యి, రెండు పేపర్లకు రూ.2వేలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ఒకేసారి ఫీజు పెంచడం కారణంగా అభ్యర్థులు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందికి గురవుతారని, ప్రభుత్వం నిరుద్యోగుల పైన అప్లికేషన్ల పేరుతో వసూలు చేసేటటువంటి వైఖరి సరికాదన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పరీక్షలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులు వసూలు చేయమని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, నేడు అప్లికేషన్ల ఫీజు పేరుతో భారీగా వసూలు చేయడం నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడమే అని అన్నారు. వెంటనే టెట్ అప్లికేషన్ ఫీజు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.