UPDATES  

 ఎండిపోయిన ప్రతి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం.. కేసీఆర్ డిమాండ్.

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు చేసే సమయం ఉందికానీ.. రైతులకు రైతు బంధు వేసే తీరక లేదని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సెట్ కావడానికి కాస్త సమయం ఇచ్చామని.. ప్రస్తుతం 4 నెలల సమయం అయినందునే ప్రశ్నిస్తున్నామని అన్నారు.

 

రాష్ట్రంలో నెలకొన్న నీటి, విద్యుత్ సమస్యకు కారకులెవరని ప్రశ్నించారు. దేశంలో ఉన్న నెంబర్ 01గా ఉన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ సమయంలో ఈ దుస్థితికి కారణం ఎంటని ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైందని దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పవర్ సిస్టం సరిగా పనిచేసిందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పవర్ ఫెయిల్యూర్ వచ్చిందని.. దానికి బాధ్యత ఎవరిదని అడిగారు.

 

తెలంగాణలో మళ్లీ నీళ్ల ట్యాంకులు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మిషన్ భగీరథ పథకంలో సమస్య ఎందుకు వచ్చిందని, నీటి సమస్యకు కారకులెవరన్నారు. 100 రోజుల్లో ఇంత అస్థవ్యస్తత ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ కాలంలో రైతులు అద్భుతంగా పంటలు పంచికున్నారని, కానీ అతి తక్కువ కాలంలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని కేసీఆర్ అన్నారు.

 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. తాము రైతుల కోసం అన్ని ఏర్పాటు చేసినా సరే.. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా అముల చేయలేక పోతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానికి ఎదిగిందని.. ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఎండపోయిన ప్రతి ఎకరాకు రూ.25 నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే వరకు పోరాడుతాం అని కేసీఆర్ అన్నారు.

 

జిల్లాల పర్యటనలో ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ జిల్లాల్లో పర్యటన చేశారు. అనంతరం సూర్యాపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని మండిపడ్డారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !