నటుడు విశ్వక్ సేన్ నటించిన ‘గామి’ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ చిత్రం అడ్వంచర్ థ్రిల్లర్ గా బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది. ఈ సినిమాతో విద్యాధర్ కాగిత డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓటిటిలో ఏప్రిల్ 5న జీ5లో విడుదల కాబోతోందని ప్రచారం. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటించారు. అభిమానులను మెప్పించారు.





