వెన్నెల కిశోర్, సంయుక్త విశ్వనాథన్ జంటగా నటించిన స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘చారి 111’ సడన్‌గా ఓటీటీలోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 1న విడుదలైన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. మురళీ శర్మ, సత్య, తాగుబోతు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. హైదరాబాద్‌లో బాంబ్ బ్లాస్ట్ చేసిన నిందితులను హీరో ఎలా కనిపెట్టాడనే అంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
