మన్యం న్యూస్ మంగపేట.
శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం చౌలం బాబు అధ్యక్షతన రాజుపేట లో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశా నాగ రమేష్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రస్థాయి గిరిజన సదస్సు ఏటూర్ నాగారం లో పెట్టడం చాలా సంతోషించ దగ్గ విషయం అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్( ఎస్ ఎఫ్ ఐ )తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 11,12 తేదీలలో ములుగు జిల్లా, ఏటూరు నాగారంలో రాష్ట్ర స్థాయి గిరిజన విద్యార్థుల సదస్సు నిర్వహిస్తుంది.
రాష్ట్రంలో గిరిజనుల విద్య అభివృధి కావాలని, అక్షరాస్యత సాధించి, ఉన్నత చదువులకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనే దృక్పథంతో అనేక పథకాలు పాలకులు తెచ్చారు కానీ,పాలిస్తున్న పాలకులు ఆర్భాటాలు తప్ప గిరిజన ప్రజల,విద్యార్థుల,నిరుద్యోగులకు జీవితాల నిజమైన మార్పుకు, అభివృద్ధికి చిత్తశుద్ధి చూపించడం లేదు.మన రాష్ట్రంలో గిరిజన విద్యకు గత అనేక సంవత్సరాలుగా నిధులు కేటాయించడం లేదు.వీరి విద్యఅభివృధికి ఏర్పాటు చేసిన ఐటీడీఏలు కేవలం మానిటరింగ్ కు మాత్రమే పరిమితం అయ్యాయి తప్ప అభివృద్ధికి నిధులు ఇచ్చేపరిస్థితి లేదు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు. అవసరం ఉన్న ప్రాంతాల్లో జూనియర్ ,డిగ్రీ మరియు ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంలో పాలకులు నిర్లక్ష్య వహిస్తున్నారు. గిరిజన విద్యార్థులు చదువుతున్న వసతి గృహాలు,ఆశ్రమ పాఠశాలలకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. టీచర్ పోస్టులు భర్తీ, వసతి గృహాలలోనాణ్యమైన భోజనం,సరిపడా కాస్మోటిక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించడం లేదు, అనేక సమస్యలతోనే అరకోర చదువులు కోనసాగిస్తున్నారు. నూతన భవనాలులేక, లైబ్రరీ, పోటి ప్రపంచంలో అవసరం అయిన కంప్యూటర్ విద్య ఉసేలేదు.
విద్యార్థులు చదువులు పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు చదవడానికి ఈ ప్రాంతంలో ఉన్నత విద్య సంస్థలు లేక మధ్యలోనే వారు చదువులకు స్వస్తి చెప్పి సంప్రదాయ పనులకు వెళ్తున్న దుస్థితి చూస్తున్నాం. అందుకే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా గిరిజన ప్రాంత విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక కేంద్రీకరణ చేయాలి. నిధులు కేటాయించాలి. విస్తృతంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలి. చదువు పూర్తయిన వారికి స్థానిక పరిశ్రమలు నెలకోల్పాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి
రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై నికరంగా ఛాంపియన్ గా పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ గిరిజన విద్యార్థుల సమస్యలపై కార్యచరణ రూపొందించి భవిష్యత్ రాష్ట్రంలో వారి హక్కులకై పోరాడేందుకు ఈ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుంది. ఈ సదస్సులో గిరిజన చట్టాలు అమలు, విద్యా, వైద్యం ,ఉపాధి,ఉన్నత విద్య అవకాశాలు ,స్థానిక పరిశ్రమలుఏర్పాటు తదితర అంశాలపై నిర్దిష్టంగా చర్చించి భవిష్యత్తు కార్యచరణ నిర్దేశిస్తూ ఉంది.ఆశయ బలం తప్ప ఆర్ధిక బలం లేని ఎస్ఎఫ్ఐకు
ఈ రాష్ట్ర స్థాయి సదస్సు జయప్రదానికై అందరూ కలిసి జయప్రదం చేయగలరని ఈ సందర్బంగా కోరారు.