మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 6: అశ్వారావుపేట మండల కేంద్రంలో తాహసీల్దార్ కార్యాలయంలో శనివారం అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తాహసీల్దార్ కృష్ణ ప్రసాద్ కు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందజేయాలి అన్నారు, బస్తా వరి ధాన్యము కొనుగోళ్లపై 500 రూపాయలు బోనస్ గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీనే వెంటనే అమలు చేయాలన్నారు. వీటితోపాటు రైతులందరికీ రైతుబంధు డబ్బులు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, చిట్టూరి ఫణీంద్ర, మందపాటి రాజమోహన్ రెడ్డి, జూపల్లి రమణారావు, సత్యవరపు సంపూర్ణ, జజ్జారపు శ్రీరామ్ మూర్తి, దారా యుగంధర్, నారం రాజశేఖర్, సంకా ప్రసాద్, ఉదయ్ కుమార్, నక్క రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
