మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్ 6: అశ్వారావుపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఐసిడిఎస్ అశ్వారావుపేట ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మన ఒటే మన భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించారు. సిష్ట మ్యాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్ స్విప్ లో భాగంగా ఓటరుకు అవగాహన కల్పించే విధానంలో భాగంగా నేలపై రంగవల్లుల వేసి అంగన్వాడీ టీచర్స్ అందరూ చేతులపై గోరింటాకు రూపంలో ఓటు గుర్తులు వేసుకుని ఓటు విలువ తెలియజేశారు. ఓటర్లకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రాజెక్ట్ అధికారిని రోజా రాణి తెలియజేసారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి స్థానిక తాహసీల్దార్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు, పార్లమెంటు ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ప్రతి యువకుడు విధిగా ఓటు వేయాలన్న అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు బలాన్ని అందరూ గుర్తించాలన్నారు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ఎంపీడీవో శ్రీనివాసరావు, తాహసీల్దార్ కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ విజయలక్ష్మి, పద్మావతి, కుమారి, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
