బెంగుళూరులో అపశృతి చోటుచేసుకుంది. హూస్సుర్ మడ్డురమ్మ గుడిలో వార్షికోత్సవాలు జరుగుతుండగా.. ఓ రథం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కర్ణాటక రాజధాని బెంగుళూరులోని అనేకల్ లోని హుస్కుర్ మడ్డురమ్మ గుడిలో వార్షికోత్సవాలు జరుగుతుండగా.. 120 అడుగుల ఎత్తున్న ఓ రథం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ రథం కూలిపోతున్న సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.
ఆ రథం కూలిపోతున్న సమయంలో అక్కడ వేలాది మంది భక్తులు ఉన్నారు. రథాన్ని తాళ్లతో కట్టి పైకి లేపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవాసత్తు అది అదుపు తప్పి కిందపడిపోయింది. అయితే రథాన్ని ఊరేగించడంలో మడ్డురమ్మ గుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దశాబ్దాల క్రితం నుంచి ఈ ఆలయంలో ఎన్నో రథాలను ఊరేగించారు.
అయితే గత కొన్నేళ్లుగా ఈ టెంపుల్ లో చాలా తక్కువ మొత్తంలో మాత్రమే రథాలను ఊరేగిస్తున్నారు. వరుసగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నందున ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 10కి పడిపోయింది.