- మరణ మృదంగాలు మోగిస్తున్న చతిస్గడ్ జంగల్.
- చత్తీస్గఢ్ సరిహద్దులో ఎదురు కాల్పులు.
- ఎదురుకాల్పుల్లో
- ముగ్గురు మావోయిస్టులు మృతి.
- అరణ్యంలో బలగాలకు మావోయిస్టులకు మధ్య
- భీకర పోరు.
- అలుపెరుగని పోరాటం చేస్తున్న బలగాలు.
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఊసూరు గ్రామo సరిహద్దుల్లో కర్రెగుట్టల వద్ద
పోలీసులకు మావోయిస్టులకు మధ్య బీకర ఎదురు కాల్పులు జరిగాయి .ఈ ఎదురు కాల్పులలో తెలంగాణ గ్రేహౌండ్స్ బెటాలియన్ పాల్గొన్నారు. ఇరువురికీ మధ్యజరిగిన ఎదురు కాల్పులలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు బలగాలు వెల్లడించాయి. తెలంగాణ సరిహద్దుల్లో నంబి పోలీస్ స్టేషన్ సమీపంలో 6 కిలోమీటర్లు దూరంలోని కరిగుట్టలు వద్ద మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు బలగాలు వెల్లడించాయి.
మృతదేహాలతో పాటు
Ak 47 -1 LMG-1 12బోర్ సాంకేతిక పరికరాలనుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు
ఎక్కడికక్కడికి అడవి ని జల్లడ పడుతూ సరిహద్దు ప్రాంతాలైన వెంకటాపురం వాజేడు పేరూరు చర్ల మండలాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి భద్రతను కట్టుదిట్టం చేశారు.