- అడవుల్లో తుపాకుల మోత
- సరిహద్దుల్లో బీకర ఎన్కౌంటర్… ముగ్గురు మావోయిస్టు మృతి
- భయంతో బిక్కుబిక్కుమంటున్న ఆదివాసులు
మన్యం న్యూస్ చర్ల:
చతిస్గడ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతలలో గత నెల రోజుల నుంచి తుపాకుల మోతలతో అడవి ప్రాంతం దద్దరిల్లుతుంది. అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసి గిరిజనులు ఏ క్షణాన ఏం జరుగుతుందో అని తమ ప్రాణాలను అరిచేతుల్లో పట్టుకొని బిక్కు బిక్కుమంటున్నారు. మావోయిస్టుల నిర్మూలన చేపట్టాలని ముఖ్య ఉద్దేశం అటు చతిస్గఢ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక గ్రేహౌండ్ బలగాలను అడవుల్లో మావోయిస్టుల కోసం శనివారం జల్లడి పడుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన పూజర్ కంకేరు నంబి పోలీస్ స్టేషన్ పరిధిలోని సమీప ఆరు కిలోమీటర్ల దూరం కర్రిగుట్టల వద్ద పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్స్ చనిపోయినట్లు, అదేవిధంగా ఘటనా స్థలం నుండి ఏకే 47, ఎల్ ఎం జి-1,12 బోర్ స్వాధీన పరుచుకున్నట్టు బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ మీడియాకు తెలిపా