మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలంలోని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు పక్షులకు దాహం తీర్చడం కోసం మట్టి చిప్పలను ఏర్పాటు చేశారు.ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో పక్షులకు నీళ్లు దొరకకపోవడం వల్ల చాలా పక్షులు చనిపోతున్నాయి. వాటి పరిస్థితి గమనించిన ట్రస్ట్ వారు ఈ విధంగా చెట్లకు మట్టి చిప్పలు ఏర్పాటు చేసి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్,ఎమ్మార్వో ఆఫీస్ ఫారెస్ట్ ఆఫీస్ ఎంపీడీవో ఆఫీస్ లలో,వివిధ ప్లేస్ లల్లో వీటిని అమర్చారు. జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి సేవలను చూస్తున్న మంగపేట మండల ప్రజలు, అధికారులు శభాష్ అంటున్నారు.ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ మాట్లాడుతూ మీకు తోచిన విధానం లో పక్షులకు నీళ్లు, ఏదైనా చిరు ధాన్యాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల అధికారులు ఎమ్మార్వో డి టి, మంగపేట ఎస్ఐ, ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది ఫారెస్ట్ ఆఫీస్ సిబ్బంది, ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్ గారు ట్రస్ట్ గౌరవ సలహాదారులు సయ్యద్ బాబా, ఉపాధ్యక్షులు పుల్లం శెట్టి అజయ్ కస్పా ముకుందం కార్యదర్శి ఆత్మకూరి సతీష్ కార్యవర్గ సభ్యులు వెంకట్ రెడ్డి సూర్య రోహిత్ దిలీప్ మరియు మిగతా సభ్యులు పాల్గొన్నారు.